నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్
కొమ్మూరు కనకారావు
విజయవాడ : తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్
మోహన్ రెడ్డిని సాంఘిక సంక్షేమశాఖమంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం
సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు గురువారం
కలిశారు. 2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు
విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదుచేసిన కేసులను
ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి
చేస్తున్నాయి. దళిత సంఘాల వినతిని ఇ సీఎంవైయస్.జగన్ దృష్టికి తీసుకు
నివస్తూ కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను
ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున,
ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు విజ్ఞప్తి చేశారు.
కేసుల ఉపసంహరణకు సానుకూలంగా సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.