రాజమహేంద్రవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి అధవర్యంలో అన్ని విధాలా రైతులకు అండగా
నిలిచి, ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
పేర్కొన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ యంత్ర సేవ పథకం
యూనిట్ ను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ
రైతు గ్రూప్ లకు వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని కింద ట్రాక్టర్లు, కంబైన్డ్
కోత యంత్రాలను సీఎం పంపిణీ చేయ్యడం జరుగుతోందన్నారు. ప్రతి అడుగులో రైతన్నకు
అండగా ఉంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట
అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు తోడుగా ఉండేలా ఆర్బీకేలను ఏర్పాటు చేశామన్నారు.
ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచామని, ఆ దిశలోనే
వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించడం , గ్రూపులకు 40 శాతం సబ్సిడీపై
అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యక్తంగా 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా
కేంద్రాలకు ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా
చాగల్లు మండలం నేలటూరు గ్రామంలో వైఎస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా శ్రీ
వినాయక రైతు మిత్ర గ్రూపుకి రూ. 14,89,186 విలువ చేసే యంత్ర పరికరాలను
రూ.5,64,074 సబ్సిడీతో మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ పథకం క్రింద శ్రీ
వినాయక కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా జాన్ డీర్ ట్రాక్టరు, బుల్ రోటవేటర్,
చాఫ్ కట్టర్, 12 ప్లేట్ డిస్క్ హారో, తొమ్మిది పళ్ళ నాగలి ( కల్టీవేటర్)
పరికరాలను పంపిణీ చేశారు.