క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
.
హైదరాబాద్ : ఆపదలో ఉన్న వారని ఆదుకోవడంలో ముందుండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
మరోసారి తన గొప్ప మనసు చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన
కాన్వాయ్‌లో తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. రామాయంపేట నుంచి సికింద్రాబాద్
వెళ్తున్న రాణిగంజ్ డిపో బస్సు చేగుంట జాతీయ రహదారి బైపాస్ వద్ద మలుపు
తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి అతి వేగంగా వస్తున్న కారు
బస్సును వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్ సల్మాన్,
జమీరుద్దీన్ గాయపడ్డారు. వారిని స్థానికులు కారులో నుంచి బయటకు తీశారు.
జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మంత్రి కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే
విద్యాసాగర్ తనయుడు సంజయ్ కారు ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం
వారిని తమ కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు.