బాలాయపల్లి :-
మామిడి రైతులు పూత దశలో అప్రపంతంగా ఉంటే దిగుబడి అధికంగా వస్తుందని మండల ఉద్యానశాఖ అధికారి ఆనంద రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో మామిడి రైతులకు పూత దశలో వచ్చే వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూత దశలో ఉన్నప్పుడు తేనె మంచు పురుగులు, పక్షి కన్ను తెగులు, బూడిద తెగులు, మసి తెగులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ పిచికారి చేయాలన్నారు. గోలి కాయ దశ నుంచి నిమ్మకాయ దశ వరకు తోడుము కుళ్ళు తెగులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. డై నైట్ పురాన్, అజాక్సిస్ట్రోబిన్,టెబ్యూకోనోజల్, ట్రిప్లాక్సీ క్లోజింగ్ పిచికారి చేస్తే ఈ వ్యాధి నుంచి నివారణ చేయుచున్నారు. అంతేకాకుండా పది సంవత్సరాలు వయసు ఉన్న మామిడి చెట్లకు యూరియా ఒక కేజీ పొటాషియం 750 గ్రాములు భూమిలో వేసి ఫిబ్రవరి నెలలో నీళ్లు కట్టాలని తెలిపారు ఆయన వెంట రైతులు తతలు ఉన్నారు.
ఫోటో:- మాట్లాడుతున్న ఉద్యాన శాఖ