వెలగపూడి : మార్గదర్శి సంస్థలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి దాడులు
చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు
ప్రభుత్వ శాఖలు తాజాగా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మార్గదర్శి
పై వివిధ ప్రభుత్వ శాఖల దాడులు చేయడాన్ని యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా మార్గదర్శి తరపున సీనియర్
న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం
మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చే
వరకు మార్గదర్శి సంస్థలపై ఎటువంటి దాడులు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాదులకు
హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.