హైదరాబాద్ : తెలంగాణ చరిత్రలోనే బీసీ సంక్షేమ శాఖకు అత్యధికంగా 6229 కోట్ల
రూపాయలను ఈ సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందని గత ఎనిమిదిన్నర ఏళ్లలో
కేవలం బీసీల కోసమే 48000 కోట్లను ఖర్చుచేసామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం
బీసీలకు చంద్రభాబు ప్రభుత్వం 9ఏళ్లకు 2037కోట్లు కేటాయిస్తే, తదనంతరం
కాంగ్రెస్ హయాంలో సైతం ఏనాడు వెయ్యికోట్లకు మించ నీయకుండా బీసీలను
వంచించారన్నరు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
కోకాపేట్ లో బీసీ ఆత్మగౌరవ భవనాల సామూహిక శంకుస్థాపనల కార్యక్రమంలో సహచర
మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్లతో కలిసి
పాల్గొన్నారు. కోకాపేట్లో చెరో ఎకరం భూమిలో కోటి ఖర్చుతో ఆరెకటిక, గాండ్ల,
చెరో 20 గుంటల భూమి యాబై లక్షల ఖర్చుతో రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల భవనాలకు
మంత్రులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. భూమిపూజ జరుపుకున్న సంఘాలతో
కలిపి కోకాపేట్లో 13 కుల సంఘాలకు 37.20 ఎకరాలు 49కోట్ల ఖర్చుతో
నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సభాద్యక్షత వహించిన మంత్రి గంగుల కమలాకర్
మాట్లాడుతూ కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే బీసీల అభ్యున్నతి కోసం కృషి
చేస్తుందని, గురుకులాలు, కళ్యాణలక్ష్మీతో పాటు కుల వృత్తులకు చేయూతగా ఉచిత
కరెంటును అందించడమే కాక అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో వేల కోట్ల
విలువైన స్థలాలను కేటాయించిందన్నారు. బీసీల పట్ల ఆపేక్ష గల సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు 95.25 కోట్లు 87.3 ఎకరాలు కేటాయించారని, ఈ ఆత్మ
గౌరవ భవనాలను సైతం తమ కులం ఖ్యాతి ఇనుమడించేలా కట్టుకోవడానికి ఆయా సంఘాలకే
అవకాశం కల్పించారని గుర్తు చేసారు మంత్రి గంగుల. నేడు భూమిపూజ జరుపుకున్న
నాలుగు కుల సంఘాలతో కలిసి 29 బీసీ ఆత్మగౌరవ ట్రస్టులు ఏకమై తమ ఆత్మగౌరవం
ప్రతిఫలించేలా భవనాలను నిర్మించుకుంటున్నాయన్నారు.