రిసార్ట్‌లో అభిషేక్ బచ్చన్ బర్త్ డే..
నటుడు అభిషేక్ బచ్చన్ తన 47వ పుట్టినరోజు సందర్భంగా భార్య ఐశ్వర్యరాయ్,
కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లిన ఫోటోలను విడుదల చేశాడు.
అభిషేక్ పుట్టిన రోజును రిసార్ట్‌లో జరుపుకున్న తర్వాత కుటుంబం సోమవారం
ముంబైకి తిరిగి వచ్చింది. బచ్చన్ కుటుంబం ఒక ద్వీపపు రిసార్ట్‌లో బస చేసిన
విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఫొటోలను అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్
చేశాడు.
అలాగే ఆయన తన పర్యటన నుంచి కొన్ని క్షణాలను పంచుకున్నాడు. అతను ఇలా
రాశాడు…”మరికొన్ని అందమైన వీక్షణలు.. ముఖ్యంగా చివరిది. నా పుట్టినరోజును
చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు” అని పోస్ట్ చేశాడు. ఇతర చిత్రాల్లో
బచ్చన్ కుటుంబానికి వారి పేర్లు, చిన్న పూలతో కళాత్మకంగా అలంకరించబడిన హోటల్
స్వాగతించడాన్ని గమనించవచ్చు.