శ్రీకాకుళం : దేశ చరిత్ర లోనే కని విని ఎరుగని రీతిలో 1.34 లక్షల ఉద్యోగాలు
కల్పించి నవచరిత్ర లిఖించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కి సచివాలయ
ఉద్యోగులంతా జీవితాంతం రుణపడి ఉంటారని గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్
ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా పేర్కొన్నారు. ఆదివారం
శ్రీకాకుళం జిల్లాలోని అనేక మండలాల నుంచి అశేష సంఖ్యలో హాజరైన సచివాలయ
ఉద్యోగులు వివిధ సమస్యలపై అందించిన వినతి పత్రాలు ఆయన స్వీరించారు. ఫెడరేషన్
శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర
అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమస్యలపై జానీ
పాషా మా ట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ తో సంబంధం లేకుండా ఉన్న పని
ఒత్తిడి తగ్గించాలని, సచివాలయ ఉద్యోగుల పై జరుగుతున్న బౌతిక దాడులను
అరికట్టేందుకు ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తామని చెప్పారు.సాధారణ బదిలీలు,
అంతర్ జిల్లా బదిలీల సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని సాధ్యమైనంత త్వరలోనే
ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని ఆయన స్పష్టం చేసారు.
గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్సులకు పూర్తి స్థాయి పంచాయితీ పరిపాలన బాధ్యతలు
కేటాయించే ఫైల్ ఆమోదం కోసం నిరంతరం ఫెడరేషన్ ప్రయత్నం చేస్తుందని జీ వో నెంబర్
149 సాధన కోసం అలుపెరుగని ప్రయత్నం కొనసాగించి ఫైల్ సాధించి తీరతామని విశ్వాసం
వ్యక్తం చేసారు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరీలకు పూర్తి స్థాయి పాలన
బాధ్యతల అప్పగించే దిశగా పలు మార్లు ప్రయత్నం చేసిన విషయాన్ని స్పష్టం చేసారు.
సాధ్యమైనంత త్వరలో వారికి కూడా కచ్చితంగా శుభవార్త వెలువడుతుందని ఆయన ఆశభావం
వ్యక్తం చేసారు. 2020వ సంవత్సరం రెండవ విడతలో ఉద్యోగాలు సాధించిన సచివాలయ
సిబ్బందికి సంబందించిన ప్రొబేషన్ డిక్లరేషన్ అంశం ఇప్పటికే పలుమార్లు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేసారు.ఎ.యన్.యం లకు జి.యన్.యం
ప్రమోషన్లు, వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు అందరూ
ఉద్యోగుల మాదిరిగా పనివేళలు కేటాయింపు పై తాను నిరంతర ప్రయత్నం
కొనసాగిస్తానన్నారు.
జె.యల్. యం గ్రేడ్-2లకు భద్రతా పరికరాలు అందజేతపై ఇప్పటికే పలు వినతి పత్రాలు
అందజేసిన విషయాన్ని ప్రస్థావించారు. సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు
వర్తింపచెయ్యాలి అనే సర్కులర్ గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ డైరెక్టర్ అన్ని
జిల్లాలకి పంపించినప్పటికి క్షేత్ర స్థాయిలో అది అమలు జరగకపోవడం వాళ్ళ
సచివాలయం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే విషయం తన దృష్టికి
వచ్చిందని, మరోసారి ఈ విషయం పై ఉన్నతిధికారులకు విజ్ఞప్తి చేస్తానని అన్నారు.
సచివాలయ ఉద్యోగులకు క్రీడలు, సాంస్కృతిక పోటీలకు నిర్వహణ కోసం ఫెడరేషన్ చేసిన
కృషి ఫలించనుందని తెలిపారు.