కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా
మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదరగొడుతోంది. విమెన్స్ డబుల్స్‌లో నిరాశ
పర్చినా.. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సూపర్ పెర్ఫామెన్స్‌తో
దూసుకెళ్తోంది. అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న సానియా – బోపన్న జోడీ
సెమీఫైనల్లో బ్రిటన్, అమెరికాకు చెందిన నీల్ సుపాస్కి-డిసీర్ క్రాజిక్లపై
7-6, 6-7, 10-6 తేడాతో విజయాన్ని సాధించి గ్లాండ్స్లామ్ ఫైనల్లో
అడుగుపెట్టారు. కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న సానియా మ్యాచ్
సమయంలోనూ, గెలిచిన తర్వాత చాలా ఎమోషనల్‌గా కనిపించింది. ఇది అద్భుతమైన మ్యాచ్
అని.. ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నామంటూ మ్యాచ్ తర్వాత సానియా తెలిపింది. తన
చివరి గ్రాండ్‌స్లామ్‌లో బోపన్నతో ఆడడం ప్రత్యేకంగా ఉందని.. ఇప్పుడు తనకు 36
ఏళ్లు.. బోపన్నకు 42 ఏళ్లు.. మేమింకా ఆడుతున్నామంటూ ఎమోషనల్ అయ్యింది. తాను
సాధారణంగా ఏడ్చేదాన్ని కాదు అని.. అయితే ఇప్పుడు ఆ ఫిలింగ్‌ను
ఆపుకుంటున్నానంటూ ఏడ్చినంత పని చేసింది సానియా. తన కొడుకును ఎత్తుకుని గట్టిగా
హగ్ కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది.