శ్రీకాకుళం : లెవీ సేకరణలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా
కలెక్టర్ శ్రీకేష్ లాటకర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా
అధ్యక్షులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శాశ్వత గౌరవ అధ్యక్షులు ధర్మాన
కృష్ణదాస్ సోమవారం భేటీ అయ్యారు. లెవీ సేకరణలో ఏర్పడే సమస్యలను వెంటనే
పరిష్కరించాలని అన్నారు. ఈ విషయంలో మిల్లులకు వచ్చిన ధాన్యం ఎంత? మిల్లులు
పంపిన బియ్యం ఎంత? అనే తదితర వివరాలను మిల్లు యజమానులు పక్కాగా రికార్డులు
నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రాపింగ్ ఆధారంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు
లింక్ పెట్టడం వలన పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణ జరుగుతుందని చెప్పారు. ఈ
ఖరీఫ్ దిగుబడులను సమీకరించే విధంగా రైస్ మిల్లర్లు ధాన్యం లెవీ సేకరణకు
సమాయత్తమవుతున్నారని, వారికున్న చిన్నపాటి సమస్యలన్నిటిని త్వరితగతిన
పరిష్కరించేలా చొరవ చూపాలనీ కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ ను కోరారు.