శ్రీకాకుళం జిల్లా సీపన్నాయుడుపేటలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ధర్మాన
మంచివాళ్లే కాదు… సమర్థులు ప్రజాప్రతినిధులుగా రావాలి…అప్పుడే అభివృద్ధి
సాధ్యం
శ్రీకాకుళం : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా సీపన్నాయుడుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మీకు మంచివాళ్లే కావాలనుకుంటే
దేవుడి గుళ్లోని పూజారులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోండి. రోజూ కొబ్బరికాయ
కొట్టి పూజ చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. మంచివాళ్లే కాదు. స్థితిగతుల్ని
మార్చేవాళ్లు ప్రజాప్రతినిధులుగా వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యం అని ధర్మాన
సూత్రీకరించారు. ధరలు ఎక్కడ పెరగడంలేదు చెప్పండి. మనవద్దనే ధరలు పెరిగాయా,
తెలంగాణలో ధరలు పెరగలేదా? ఒడిశాలో కరెంటు రేట్లు మనకంటే చవకగా ఉన్నాయా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ధరలు పెరగడం అనేది ఉంటూనే ఉంది. అన్నీ చేసిన
వాడికి మనం ఓటేయకపోతే, రేపు వచ్చినవాడు ఏమనుకుంటాడు? అన్నీ చేస్తే వీళ్లు
ఓటేయరు అనుకోడా? చేసినవాళ్లను చేసినట్టుగా మర్యాద ఇవ్వండి, చేయనివాడిని
చేయనివాడిగానే భావించి గుణపాఠం చెప్పండి. అప్పుడే రాజకీయ పార్టీలు, నేతలు
గాడినపడతారని ధర్మాన వ్యాఖ్యానించారు.