విజయవాడ : విజయవాడ ధర్నా చౌక్ లో ఆదివారం అర్ధరాత్రి అంగన్వాడి వర్కర్స్ పై పోలీసులు దౌర్జన్యంగా విరుచుకుపడి అరెస్టు చేస్తున్న సందర్భంగా వార్తల కవరేజ్ కి వెళ్ళిన విలేకరులు, ఫోటోగ్రాఫర్లపై పోలీసులు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి పాల్పడడం పట్ల ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. విలేకరులపై ఇంత పెద్ద ఎత్తున పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని ఏ.పీ.ఎం.పీ.ఏ. పేర్కొంది. పోలీసులు ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ రామును అరెస్ట్ చేయడమే కాకా మరో ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ రమణ పై దౌర్జన్యంగా వ్యవహరించారని ఏ.పీ.ఎం.పీ.ఏ. పేర్కొంది. బాధ్యతాయుతమైన డిసిపి విశాల్ గున్ని ఈ సందర్భంగా నిర్లక్ష్యంగా మాట్లాడటం పట్ల ఏ.పి.ఎం.పి.ఏ. నిరసన వ్యక్తం చేసింది. డిసిపి వైఖరి వల్లే పోలీస్ అధికారులు మరింత రెచ్చిపోయి మీడియాపై దౌర్జన్య వ్యవహరించడం పై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధ్యులపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్కా. రాజేష్ బాబు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శాఖమూరి మల్లికార్జునరావు,రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమణ,విజయవాడ నగర అధ్యక్షులు టి అనీల్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.