మంచి వర్షాలు కురిపిస్తా
రంగంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి
హైదరాబాద్ : ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో
భాగంగా సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత
భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు.
గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని..
మీ వెంటా ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని, భయపడొద్దని
చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా
హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
బోనాల్లో కీలక ఘట్టం..భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత : లష్కర్
బోనాల్లో సోమవారం ఉదయం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో
రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు.
గతేడాది ఇచ్చిన వాగ్ధానాలు మరిచారని అన్నారు. అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా
ఉండాలని స్వర్ణలత చెప్పారు. మంచి వర్షాలు కురిపిస్తానని తెలిపారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పాల్గొన్నారు. రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ మీరు చేసిన పూజలతో నేను సంతోషంగా
ఉన్నాను. ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నాను. అయిదు వారాల పాటు నన్ను
ముత్తైదులందరూ భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలి. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా
చుసుకునే బాధ్యత నాది. 5 వారాలు నాకు సాక పోయండి నాయన. ఏది బయట పెట్టాలో ఏది
పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు
మర్చిచ్చిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. నేను మీతోనే ఉంటాను’ అని
పేర్కొన్నారు.
రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో
మాట్లాడారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షల మంది భక్తులు
పోటెత్తారని, రాత్రంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం, మంత్రులు, వివిధ
పార్టీల పెద్దలు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారు భవిష్యవాణిలో
బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర
పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. మరికాసేపట్లో పోతరాజుల
ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం
బండ్ల ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు.
కాగా చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా
జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు
అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం
ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి
దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి
మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు
ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.