నరసన్నపేట : రానున్న ఎన్నికల్లో విజయానికి వారధులుగా నిలిచే గృహ సారథులే
జగనన్న సైన్యమని జిల్లా వైఎస్ఆర్సిపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేట మండలం ఉర్లాంలో శుక్రవారం నిర్వహించిన
గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో కృష్ణదాస్ మాట్లాడారు.
గృహ సారథు లపై గురుతర భాధ్యత ఉందని అన్నారు. వారంతా జగనన్న సైన్యంలా
అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ
పధకాలను తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అందిస్తున్న సుపరిపాలనలో భాగంగా అభివృద్ధి సంక్షేమం రెండు ప్రగతి శ్రీ
చక్రాల్లా పరుగులు పెడుతున్నాయన్నారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ అమలుచేయని సంక్షేమ
కార్యక్రమాలను, గ్రామ సనివాలయాలు వంటి పాలనా వ్యవస్థలను అమలు నేస్తూ సీఎం జగన్
చరిత్ర సృష్టించారని అన్నారు. రైతుభరోసా కేంద్రాలు రైతులకు అన్ని దశల్లో అండగా
నిలుస్తున్నాయని తెలిపారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు సమన్వయంతో పనిచేసి
లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఒకప్పుడు సంక్షేమ పథాకాలు జన్మభూమి కార్యకర్తల
ఖాతాల్లోకి వెళ్లిపోతుండేవని జగన్ తన పాలనలో ఈ విధానానికి చెక్
పెట్టారన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో సీఎం జగన్
దేశంలోని ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆదర్శంగా నిలిచారని అన్నారు. సంక్షేమ
పథకాలు పొందుతున్నవారికి విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ ఇంటింటికీ మా నమ్మకం
నువ్వే జగర్ స్టిక్కర్లు అతికించాలని సూచించారు. ఈ సమావేశంలోనే నరసన్నపేట మండల
పార్టీ అధ్యక్షునిగా లుకలాపు రవిని నియమించి అతనిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ శిక్షణ కార్యక్రమాల్లో జేసీఎస్ కన్వీనర్ సురంగి నర్సింగరావు. ఎంపిపి ఆరంగి
మురళీధర్. జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, సర్పంచ్ పోలాకి నరసింహమూర్తి,
ఎంపీటీసీ నడిమింటి లక్ష్మి, కార్పొరేషన్ డెరెక్టర్లు బొబ్బాది ఈశ్వరరావు,
తరావు రంజిత్ కుమార్, వైస్ ఎంపిపిలు చింతల వెంకట రమణ, పాగోటి రాజారావు,
పిఎసీఎస్ అధ్యక్షులు ప్రభాకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాబాజీ వెంకట రమణ,
మండల వ్యవసాయ సంఘం అధ్యక్షుడు యాక్ష కృష్ణంనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి
బార్ల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.