యూకే ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ధన్‌ఖఢ్
లండన్ : భారత్ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని యునైటెడ్ కింగ్డమ్
(యూకే)లోని ప్రవాస భారతీయులకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్ పిలుపునిచ్చారు.
ఆయన లండన్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. మీలో ప్రతి ఒక్కరూ భారత
రాయబారే. ప్రస్తుతం మన దేశం ప్రపంచ తయారీ కేంద్రం. దేశ ప్రతిష్ఠను పెంచడానికి
మీ వంతు ప్రయత్నం చేయండి. వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టండి. సద్విమర్శలకు
ఎవరూ వ్యతిరేకం కాదు. అవి మన లక్ష్యాలను సాధించడానికి సాయపడతాయి. కానీ
దుష్ప్రచారాలను సహించకండని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు