బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మీరు ఆశీర్వదిస్తే మీలో ఒకడు లా ఉంటూ మీకు సేవ చేసుకుంటానని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామణి పేర్కొన్నారు. బుధవారం బాలాయ పల్లిలో వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పంట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగ డపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. మీరు ఆశీర్వదిస్తే మీతో ఉంటూ మీకు సేవ చేసుకుంటామన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకులకు వస్తే ప్రతి మహిళకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి. నాగభూషణం,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- మహిళలతో మాట్లాడుతున్న దృశ్యం