ఆరోగ్యంతో పాటు కంటిచూపును కాపాడుకోవడం కూడా అవసరమే. తేమ, వేడి వల్ల కంటికి
అపాయం జరగొచ్చు. అందుకే మెరుగైన కంటిచూపు కోసం వానాకాలంలో ఈ చిట్కాలు
పాటించండి.
మాయిశ్చరైజ్:
వానాకాలంలో తేమ వల్ల కళ్లు తరచూ పొడిబారిపోతాయి. తేమ గాలులు, వేడికి ఇలా
జరుగుతుంది అయితే మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్టిఫిషియల్ డ్రాప్స్
దొరుకుతాయి. అవి వాడండి.
సన్ గ్లాసెస్:
కంటి ఆరోగ్యం కోసం వానాకాలంలో సన్ గ్లాసెస్ వాడటం చాలా అవసరం. ఇవి కంటిని
అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి. అలాగే కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆహారం:
పోషకాలు మెండుగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడం వల్ల కంటిచూపును కాపాడుకోవచ్చు.
టొమాటో, జుచ్చిని, ఆకుకూరలు, పుచ్చకాయ వంటి ఆహారాలు తీసుకోవాలి.
స్విమ్మింగ్:
ఈత అంటే చాలామందికి ఇష్టం. కానీ ఇది కళ్లకు మంచిది కాదు. అందువల్ల ఈత
కొట్టేటపుడు కళ్లకు గ్లాసెస్ ధరించండి.
సన్ స్క్రీన్:
వేసవిలోనే కాదు వానాకాలంలో బయటకు వెళ్లినపుడు సన్ స్క్రీన్ రాసుకోవడం అవసరం.
అయితే సన్ స్క్రీన్ కళ్లకు తాకేలా పెట్టుకోకండి. దీనివల్ల కళ్ల మంట, వాపు
వస్తుంది.
దుమ్ము, ధూళి:
బయటకు వెళ్లినపుడు దుమ్ము, ధూళి నుంచి కళ్లను కాపాడుకోండి. బయట తిరిగే సమయంలో
దుమ్ము వస్తే ఏదైనా క్లాత్ లేదా వస్తువు అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
చేతులు శుభ్రంగా:
మురికి చేతులతో కంటిని ముట్టుకోకండి. కళ్లు రుద్దుకోవడం అస్సలే చేయవద్దు. మీకు
కళ్లలో దురద అనిపిస్తే చేతులు శుభ్రంగా కడుక్కొని కంటిని తాకండి.
నీళ్లు:
ఎండ వల్ల తరచూ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగడం
అవసరం. మెరుగైన కంటిచూపు కోసం కూడా నీరు అవసరం. అందుకే నీరు ఎక్కువగా తాగాలి.