క్షేమంగా వెళ్ళి చిన్నారిని ఆరోగ్యంగా నా దగ్గరకు తీసుకురండి : మంత్రి ఆర్కే
రోజానగరి: మంత్రి ఆర్కేరోజా నగరిలోని తమ క్యాంపు కార్యాలయంలో బాధితులకు బుధవారం
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. తమ చిన్నారి బేబి రుద్రాంక్షి
‘బైలియరి అట్రిసియం’ తో బాధపడుతోందని ఆర్గాన్ మార్పిడి ఆపరేషన్ కోసం
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయించాలని తిరుమల వాస్తవ్యులైన
డాక్టర్ కలవగుంట మహేష్ ప్రస్తుతం నగరి ప్రభుత్వానుపత్రిలో వైద్యులుగా
పనిచేస్తున్నారు. వారు మంత్రిని కలిసి విన్నవించారు. వెంటనే స్పందించి సమస్య
తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంత్రి రోజా ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డిని నేరుగా విజయవాడలో కలిసి చిన్నారి యొక్క ఆరోగ్య
పరిస్థితిని స్వయంగా వివరించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారి పాప ఆపరేషన్
కోసం అవసరమైన రూ. 22 లక్షల నగదును మంజూరు చేయించారు. బుధవారం నగరిలోని క్యాంపు
కార్యాలయంలో చిన్నారి యొక్క తండ్రి డాక్టర్ మహేష్ కి ముఖ్యమంత్రి సహాయనిధి
ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కేరోజా పాపకు
అవసరమైన వైద్యం చేయించాలని ‘రేలా ఇంస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్, చెన్నై’
ఆసుపత్రి నిర్వాహకులతో సైతం మాట్లాడామని, పాప ఆరోగ్యంగా తిరిగి ఇంటికి
చేరుతుందని, క్షేమంగా వెళ్ళి సంపూర్ణ ఆరోగ్యంతో తమ చిన్నారి రుద్రాంక్షి తో
కలిసి రావాలని దీవించారు. డాక్టర్ గా ఎందరినో ఆదుకున్న మీ పాపకి మంచి
జరుగుతుందని వారికి ధైర్యం చెప్పి చెక్ ను అందజేశారు.