చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణమార్కాపురం : ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద మహిళ కష్టం, ఉన్నతి పట్ల ఎంత అంకిత
భావంతో ఉన్నందున ఆ నారీలోకమంతా మిమ్మల్ని దీవించారని బీసీ సంక్షేమం, సమాచార
శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అందుకే సకాలంలో
వర్షాలు, ప్రాజెక్టులు నిండాయని అధికంగా దిగుబడులు వచ్చాయి, నారీలోకం పండుగ
చేసుకుంటుంది. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని జగన్ తపస్సు
చేశారన్నారు. అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం పేరుతో మూడేళ్ళపాటు ఏటా రూ.
15 వేల చొప్పున సాయం చేస్తున్నారు. బటన్ నొక్కగానే మీకు నేరుగా చేరుతున్నాయి,
ఏ మహిళ అయినా భరోసాగా బతకాలన్నదే ఆయన ఆలోచన, మహిళలను దేశానికి ఆదర్శంగా,
జ్యోతిరావుపూలే బాటలో ముందుకెళుతున్నారు. ముందుతరాలకు కూడా భరోసానిచ్చే పాలన
అందజేస్తున్న సీఎంకి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
కాసుల వెంకట అరుణ, లబ్దిదారు, మార్కాపురం
అన్నా నా భర్త చిన్న ఉద్యోగస్తుడు, అగ్రవర్ణాలలోని మాలాంటి పేదలను గుర్తించి
మీరు సాయం చేస్తున్నారు, ధన్యవాదాలు అన్నా, ఈ డబ్బుకు రూ. 15 వేలకు తోడు
మరికొంత కలుపుకుని కిరాణాషాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఇద్దరు
పిల్లలు, అమ్మ ఒడి సాయం అందింది, గతంలో ఎప్పుడూ లేని విధంగా నాడు నేడు
కార్యక్రమం ద్వారా స్కూల్స్ బాగుచేశారు, జగనన్న గోరుముద్ద బావుంది, మంచి
పౌష్టికాహారం ఇస్తున్నారు, మా పాపకు ట్యాబ్ ఇచ్చారు, బాగా చదువుకుంటుంది, మా
పాప కూడా సీఎంకి ధ్యాంక్స్ చెప్పమంది, ధ్యాంక్స్ అన్నా, మాలాంటి పేదలకు
సొంతింటి కల నెరవేరింది, మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు బావున్నాయి, ప్రజల
వద్దకు పాలన కాదు ప్రజల దగ్గరికే పాలన అందుతుంది, మీరు కలకాలం చల్లగా ఉండాలని
కోరుకుంటున్నాను, మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు
ధన్యవాదాలు తెలిపారు.