బాలీవుడ్ నటులు ఆయుష్మాన్ ఖురానా, జైదీప్ అహ్లావత్ నటించిన యాక్షన్ హీరో సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ పార్టీని గురువారం సాయంత్రం ముంబైలో నిర్మాతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోలు ఆయుష్మాన్, జైదీప్ లు ఇద్దరు పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో వచ్చారు. ఆయుష్మాన్ నలుపు జాకెట్, మ్యాచింగ్ ప్యాంట్లో కనిపించగా.. జైదీప్ సాంప్రదాయ నలుపు దుస్తుల్లో వచ్చాడు. ఇదే కార్యక్రమానికి ఆనంద్ ఎల్ రాయ్, భూషణ్ కుమార్ కూడా హాజరయ్యారు. అనిరుధ్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో జైదీప్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ట్రైలర్ విడుదల కానుంది.