వినతిపత్రం అందించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర
అధ్యక్షులు ఎం.డి.జాని పాషా
అధ్యక్షులు ఎం.డి.జాని పాషా
విజయవాడ : దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యవస్థ
సృష్టించి లక్షా ముప్ఫయి నాలుగు వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు
కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి లక్షా ముప్ఫయి
నాలుగు వేల మంది సచివాలయ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపేందుకు సభ
ఏర్పాటు చేయడం కోసం అనుమతి ఇప్పించి ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారిని
ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి ఘనంగా సత్కరించే అవకాశం కల్పించాలని వినతి
అందించి సచివాలయంలో అభ్యర్దించారు. వెంటనే సి.ఎం.ఒ తో మాట్లాడి అనుమతి మంజూరు
అయ్యేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు