కడప : వివిధ వ్యాధులతో బాధపడుతున్న అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందుల
లకు చెందిన ఇద్దరు చిన్న పిల్లల మెరుగైన వైద్య కోసం రెండు కుటుంబాలకు ఆర్ధిక
సహాయం అందింస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ
ఇచ్చారు. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్
రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నట్లు భార్య శివజ్యోతి
తమ ముగ్గురు పిల్లలతో సౌమ్య, హరిప్రియ, యమిని లతో కలసి ముఖ్యమంత్రి ని కలసి
అర్జీ సమర్పించారు. నవంబర్ 12 నుండి ఆస్టర్ సి.ఎం.ఇ బెంగళూరు హాస్పిటల్
నందు చికిత్స పొందుతున్న నా భర్తకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని
డాక్టర్లు చెప్పారని, మీరే ఆదుకోవాలని ముఖ్యమంత్రి కి విన్నవించింది. అనంతరం
వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి తక్షణమే రూ.2లక్షలు మీ అకౌంట్ లోకి
వేస్తామని,పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తామని భరోసా
కల్పించారు. పులివెందుల లో నివసిస్తున్న కె శివకుమార్, టైలరింగ్ చేసుకుంటూ
భార్య జి.వరలక్షి గృహిణిగా ఇద్దరు పిల్లలు 8ఏళ్ల హైందవ్ , 5ఏళ్ల కుషల్ లతో
జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మా ఇద్దరు పిల్లలు తీవ్ర మైన అనిమియా
వ్యాధితో బాధపడుతున్నట్లు వారికి రక్తం పెరుగుదలకు ఇంజక్షన్
వాడుతున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలకు
తిరిగినామన్నారు. ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ కిందకు రాదన్నారని ప్రస్తుతం హైదరాబాద్
లోని అమెరికన్ అంకాలజిస్ట్ దగ్గర చికిత్స చేయిస్తున్నామని ఇప్పటికి రూ.15
లక్షలు ఖర్చు అయిందని, సర్వం అమ్ముకొని కోల్పోయామని మీరే మమ్మల్ని మా
పిల్లల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ని కలసి అర్జీ సమర్పించారు. అనంతరం
ముఖ్యమంత్రి పిల్లల ఆరోగ్యానికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.