అడిగిన వెంటనే జగనన్న నిధులు మంజూరు
ఆంధ్ర ప్రదేశ్ హోం శాఖ మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం : కొవ్వూరు పట్టణంలో ఈ 24వ తేదీ బుధవారం నిర్వహించిన
రాష్ట్రస్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసిన స్థానిక
నాయకులకు, నియోజకవర్గం ప్రజలకు, అధికారులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా రాష్ట్ర
హోం మంత్రి తానేటి వనిత కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం హోం మంత్రి క్యాంపు
కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి
వనిత మాట్లాడుతూ మే 24 వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కొవ్వూరు నియోజకవర్గంలో గల కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి
జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా
జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి
సహకరించిన నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, జిల్లా యంత్రాంగంతో పాటు
ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేసారని వారందరికీ నా ధన్యవాదాలని
పేర్కొన్నారు. వేసవి కావడంతో చాలా తీవ్రమైన ఉష్టోగ్రత ఉన్నప్పటికీ జగనన్న
అభిమానంతో నియోజకవర్గ ప్రజలందరు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం
చేసారన్నారు. ఇదే ఉత్సాహంతో నియోజక వర్గ ప్రజలందరూ జగనన్నకు
అండావుండాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల అభివృద్ది కొరకు
అవసరమైన కొవ్వూరులో డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం, నియోజకవర్గంలో మూడు
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులు, మూడు అంబేద్కర్ భవనాలు, ఎస్సీ
కమ్యూనిటీ హాల్, కాపు భవనం, షాధీ ఖానాతో పాటు కొవ్వాడ కెనాల్ మీద కల్వర్టు
కోసం నిధులు మంజూరు చేయాలని మఖ్యమంత్రి జగనన్నను కోరడం జరిగింద పేర్కొన్నారు.
అడిగిన వెంటనే ముఖ్యమంత్రి జగనన్న వీటన్నింటినీ మంజూరు చేస్తూ హామీ ఇచ్చారని
హోం మంత్రి తానేటి వనిత వివరించారు.