విజయవాడ : జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుండి 62
సంవత్సరాలు చేసిన సందర్భంగా రాష్ట్ర గ్రంధాలయ ఉద్యోగుల తరపున కృతజ్ఞతా
పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి శనివారం
రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు క్షీరాభిషేకం
నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు
సరియైన న్యాయం చేస్తూ వారి బాగోగులని కుటుంబాల అవసరాలని తీరుస్తూ రాష్ట్ర
పెద్దగా బాధ్యతాయుతమైన పాలన్నీ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన రామ
రాజ్యంగా తలపిస్తుందని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా
రాష్ట్రానికి మంచి పాలన అందించాలని రాష్ట్ర ప్రజలు,ఉద్యోగస్తులు, అట్టడుగు
వర్గాల ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యోగులు జగన్మోహన్
రెడ్డి కి వెన్నుదన్నుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల తరపున రాష్ట్ర గ్రంథాలయ పరిషత్
చైర్మన్ మందపాటి శేషగిరిరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా
గ్రంథాలయ సంస్థ చైర్మన్ పూర్ణమ్మ , జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రవికుమార్
గారు, జిల్లా ఉద్యోగుల సంఘల అధ్యక్షుడు కళ్ళేపల్లి మధుసూదన్ రాజు,కంచల
నాగరాజు, ఉద్యోగ సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.