అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హాజరుకు సంబంధించి
ఇటీవల ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు
విధానంకు సంబంధించి ఎవరికీ ఏవిధమైన మినహాయింపు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ
ముఖ్య కార్యదర్శి (పొలిటికల్)(ఎఫ్ఎసి) ఆర్.ముత్యాల రాజు స్పష్టం చేశారు.
మంత్రులు, ఎంపిలు, ఎంఎల్సిలు, ఎంఎల్ఏలు తదితర ప్రజాప్రతినిధుల వద్ద
పనిచేస్తున్న ఓఎస్డిలు, పిఎస్ లు, అదనపు పిఎస్ లు, పిఏలకు ముఖ గుర్తింపు
ఆధారిత హాజరు నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్టు వస్తున్నవార్తలు వాస్తవం
కాదని ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయానికి
అనుగుణంగా ఉద్యోగుల ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానానికి సంబంధించి ఫిబ్రవరి
17వ తేదీన జారీ చేసిన మెమోలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ముఖ్య
కార్యదర్శి ముత్యాల రాజు స్పష్టం చేశారు.కావున పై ఆదేశాలను అనుసరించి రాష్ట్ర
ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే అధికారులు,
ఉద్యోగులందరూ విధిగా ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని తప్పక పాటించాలని
ఈవిషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదని ఆయన పునరుద్ఘాంటించారు.ఈయాప్ లో
టూర్/ఆన్ డ్యూటీ అనే ఆఫ్సన్ ను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.
కావున రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ విధిగా ముఖ
గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందిగా ముఖ్య
కార్యదర్శి ముత్యాల రాజు స్పష్టం చేశారు.