హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు
ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, అదనపు న్యాయమూర్తులుగా
లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి, సుజన కలసికంలతో ప్రమాణం
చేయించారు. అనంతరం అదనపు న్యాయమూర్తులుగా తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులై,
సీనియర్ న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ల్లో కేసుల విచారణ చేపట్టారు. ఈ
కార్యక్రమానికి న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, బార్
కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్
సి.ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్‌కుమార్, అదనపు
న్యాయమూర్తుల బంధువులు హాజరయ్యారు. వీరికి సాయంత్రం హైకోర్టు బార్
అసోసియేషన్ హాలులో అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం
ఏర్పాటు చేశారు. న్యాయవాదులతో పాటు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు
చెంగల్వ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కృష్ణకుమార్‌గౌడ్, కార్యవర్గం
సభ్యులు పాల్గొన్నారు.