నల్లగొండ : మునుగోడు లో ఇప్పటి వరకు రూ.1,48,44,160 కోట్లు పట్టుకున్నామని మునుగోడు ఉప ఎన్నిక ఆర్వో రోహిత్ సింగ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మునుగోడులో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారని, గల్లంతైన ఓటర్లు రోజూ ఆఫీసుకి వస్తున్నారని, వాళ్ల సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమనిబంధనలు అన్ని పాటిస్తున్నామని అన్నారు. ఈవీఏం మిషిన్స్ రెడీ చేస్తున్నామని, అన్ని కండిషన్స్లోనే ఉన్నాయని వెల్లడించారు. మాక్ పోల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్వో రోహిత్ సింగ్ పేర్కొన్నారు.