‘సీతారామం’ సినిమాతో దక్షిణాదిలో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకుంది
మృణాల్ ఠాకూర్. ఆమె ప్రస్తుతం తెలుగులో నాని, విజయ్ దేవరకొండతో కలిసి
నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు సెట్స్ పై శరవేగంగా
రూపొందుతున్నాయి.కాగా ఇప్పుడామె తమిళ చిత్రసీమ నుంచి పిలుపుఅందుకున్నట్లు
సమాచారం. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ త్వరలో శివ కార్తికేయన్ హీరోగా ఓ కొత్త
చిత్రం పట్టాలెక్కించనున్నారు. అందులో మృణాల్ ఠాగూర్ కథానాయికగా ఎంపిక
అయినట్టు సమాచారం. ఇప్పటికే కథాచర్చలు పూర్తయ్యాయని స్క్రిప్ట్ నచ్చడంతో
సినిమా చేసేందుకు అగికరించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ కెరీర్ లోనే ఇది
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. వినూత్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ గా
ఉంటుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మృణాల్ ప్రస్తుతం
హిందీలో పూజా మేరీ జాన్, పెప్పా’ చిత్రాల్లో నటిస్తోంది.