మేడారం : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర
ప్రారంభమైంది. రాచరిక పాలన మీద పోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో
మేడారం నుంచి యాత్ర చేపట్టినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో
సంపూర్ణ మార్పే యాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు చేపట్టిన హాథ్ సే
హాథ్ జోడో అభియాన్ యాత్రను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ప్రారంభించారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు చేసి
యాత్రకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలతో రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన
స్వాగతం పలికాయి. వన దేవతలకు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ నేతలు
పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు జాకారం గట్టమ్మ గుడి,
సాయిబాబా దేవాలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ములుగు జిల్లా
ప్రాజెక్ట్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాచరిక పాలన మీద
పోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టినట్లు
చెప్పారు. తెలంగాణ వస్తే మార్పు వస్తుందని ఉద్యమకారులు, నిరుద్యోగులు,
పాత్రికేయులు అనుకున్నారని.. ఎవరి జీవితాల్లోనూ మంచి జరగలేదని ఆవేదన వ్యక్తం
చేశారు. తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదన్నారు.
కేసీఆర్ ఎవరు చెప్పింది వినరని.. ఆయనకు తెలియదని విమర్శించారు. ఈ క్రమంలోనే
రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని రేవంత్ ఆరోపించారు. ”తెలంగాణలో
సంపూర్ణ మార్పు కోసం యాత్ర చేపట్టాం. రాచరికం మీద పోరాటం చేసిన
సమ్మక్క-సారాలమ్మ స్ఫూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టాం. సీఎం కేసీఆర్ పీడ
విరగడ కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. బడ్జెట్‌పై ఎప్పుడూ కేసీఆర్ అబద్ధాలే
చెబుతారు. కేసీఆర్ వచ్చాక 30 శాతం బడ్జెట్లో తేడా వచ్చింది. ఇచ్చేది ఏమి లేదు
కాబట్టి రాసుకోరా సాంబా అంటే హరీశ్ రాసుకుని చదివారని టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి అన్నారు.