ముస్లింలకు బాబు 5 ఏళ్ళలో చేసిన ఖర్చు రూ. 2,665 కోట్లు.. జగన్
మూడున్నరేళ్ళలోనే రూ. 20 వేల కోట్లుకు పైగానే
గ్రీన్ ఛానల్ ద్వారా ఇమామ్ లు, మౌజంలకు ప్రతినెలా గౌరవ వేతనాలు
ఇప్పటివరకూ రూ. 248.85 కోట్లు ఇచ్చాం
ఇమామ్ లు, మౌజంల గౌరవ వేతనాలకు రూ.12 కోట్లు..తోఫాకు 69 కోట్లు ఎగ్గొట్టింది
బాబే
మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించింది చంద్రబాబే
చంద్రబాబు కేబినెట్ లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదు.
ఏపీ చరిత్రలోనే ముస్లింలను డిప్యూటీ సీఎం చేసింది సీఎం జగన్
తోఫా పేరుతో చంద్రబాబు ఇచ్చిది గోరంత..ప్రచారం కొండంత
మైనార్టీల అభ్యున్నతికి తొడ్పడింది జగన్ ఒక్కరే
ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది మేమే
మైనార్టీలకు పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం పది వేల కోట్లు ఖర్చు
ముస్లిం మైనార్టీలకు వరంగా వైఎస్సార్ షాదీ తోఫా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా
కడప: ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ నటిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
ఎస్బి అంజాద్ బాషా అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కడపలో మీడియా
సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలపై పచ్చ మీడియా కపట ప్రేమ చూపు
తోందని,వరాష్ట్రంలోని ముస్లిం, మైనారిటీలపై చంద్రబాబు, ఆయన అనుకూల పచ్చ
పత్రికలు సానుభూతి, కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల
సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు వైఎస్ జగన్ గారు ఒక్కరే.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో మైనార్టీలను అన్ని విధాల ముందుకు తీసుకువెళుతూ,
రాజకీయ సాధికారిత అందించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
ముస్లిం, మైనార్టీలకు అన్ని విధాల మేలు జరుగుతున్నా ఈనాడు రామోజీరావు ఇలాంటి
రాతలు రాయించడం సరైంది కాదు. మరో వైపు కుహనా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన
చంద్రబాబు అభద్రతాభావంతో లాస్ట్ చాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల వద్ద
మొరపెట్టుకుంటున్నాడు. కులాల మధ్య చిచ్చు పెట్టే దుర్మార్గపు ప్రయత్నాలు
చేస్తున్నాడు.
బాబు క్యాబినెట్ లో మైనార్టీలకు చోటెందుకు ఇవ్వలేదు?
గత చంద్రబాబు ప్రభుత్వంలో మైనార్టీలకు ఒక్కరికి కూడా తన మంత్రి వర్గంలో అవకాశం
కల్పించలేదు. స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్క చంద్రబాబు పాలనలోనే
మైనార్టీలకు మంత్రి పదవి లేదు. మైనార్టీలను ఆయన ప్రభుత్వం ద్వితీయ శ్రేణి
పౌరులుగా చూసింది. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఈ
ఎల్లో మీడియాను, ఈనాడు రామోజీరావును ప్రశ్నిస్తున్నా.
తోఫా పేరుతో చంద్రబాబు ఇచ్చిది గోరంత..
ఈనాడు దినపత్రిక ద్వారా చంద్రబాబు తన సవతితల్లి ప్రేమ చూపుతూ రాయించిన రాతలకు
నవ్వాలో, ఏడవాలో కూడా అర్ధం కావడం లేదు. చంద్రబాబు హయాంలో తోఫా ఇచ్చామంటూ
గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ తోఫా విలువ కనీసం రూ.200 కూడా చేయదు. ఆనాడు
చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థలో అమ్ముడుపోని బూజుపట్టిన బెల్లం తదితర సరుకులు
మైనార్టీల ముఖాన కొట్టి ఏదో ఘన కార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.
ఇస్లాంలో అతి పవిత్రమైన రంజాన్ మాసంలో స్థోమత కలిగిన ప్రతి ముస్లిం పేదలను
జకాత్ రూపంలో ఆదుకుంటారు. చంద్రబాబు తోఫా ఇవ్వకపోతే ఆ పేదలకు పండుగ
జరగదన్నట్లు కలరింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిది గోరంత.. ప్రచారం, ఆర్భాటం
కొండంత.
మైనార్టీల అభ్యున్నతికి తొడ్పడింది శ్రీ వైఎస్ జగన్ ఒక్కరే:
ఏ సామాజికవర్గమైనా సామాజికంగా, రాజకీయంగా ఎదిగిన నాడే నిజమైన ఎదుగుదల
కన్పిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్
జగన్. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమం కోసం కేవలం రూ. 2,665
కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ మూడున్నరేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.
20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం ఇది. డీబీటీ ద్వారా మైనార్టీలకు
రూ. 10309 కోట్లు లబ్ధిదారుల ఎకౌంట్లలోకి నేరుగా బదిలీ చేశారు. నాన్ డీబీటీ
ద్వారా రూ. 10020 కోట్లు ఈ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు చేశారు.
వైఎస్సార్ పెన్షన్ పథకం, అమ్మ ఒడి, చేయూత, రైతుభరోసా వంటి అనేక పథకాలు
మైనార్టీ సోదరులు, అక్క చెల్లెమ్మల ఇళ్లకు నేరుగా చేరుతున్నాయి. కోవిడ్
సమయంలో రూ. 81 కోట్ల రూపాయలు మైనార్టీల ఎకౌంట్లలోకి పంపిన ప్రభుత్వం మాది.
వైఎస్సార్ వాహన మిత్ర లాంటి పథకాల్లో మెజార్టీ శాతం మైనార్టీలే
లబ్ధిపొందారు. ఇక వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఎంతో మంది మైనార్టీల
ప్రాణాదాతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచారు.
గ్రీన్ ఛానల్ ద్వారా ఇమామ్ లు, మౌజంలకు గౌరవ వేతనాలు
ఇప్పటివరకూ రూ. 248 కోట్లు ఇచ్చాం
ఇమామ్, మౌజంల విషయంలో ఈ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుని ప్రతి నెలా గౌరవ
వేతనం అందిస్తోంది. కేవలం ఇమాంలు, మౌజంలకు ఇప్పటి వరకూ రూ. 248 కోటు గౌరవ
వేతనంగా చెల్లించాం. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హాయంలో ఇమాంలకు రూ.5వేలు,
మౌజంలకు రూ.3 వేలు మాత్రమే ఇచ్చేవారు, అదికూడా ఎగ్గొట్టారు. కానీ ముఖ్యమంత్రి
జగన్ తన సుధీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్ లకు రూ. 10 వేలు,
మౌజంలకు రూ. 5 వేల చొప్పున ఒక్కో మసీదుకు రూ. 15 వేలు గౌరవవేతనంగా అందిస్తున్న
ఘనత మా ప్రభుత్వానిదే. చంద్రబాబు ఎన్నికలకు మందు ఇమాంలు, మౌజంలకు సుమారు రూ.
12 కోట్లు బకాయిలుగా పెట్టి వెళ్తే దాన్ని కూడా చెల్లించింది మేమే. ఇచ్చిన మాట
ప్రకారం వారికి గౌరవ వేతనం కూడా పెంచిన మైనార్టీల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్
మాత్రమే. ప్రస్తుతం ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా వారికి గౌరవ వేతనం
అందిస్తున్న ప్రభుత్వం మాది.
మైనార్టీలకు పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం పది వేల కోట్లు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత మా
ప్రభుత్వానిది. రోజూ కూలి చేసుకునే బతికే మైనార్టీ అక్కచెల్లమ్మలకు వారి
సొంతింటి కల నెరవేరుస్తూ రూ. 3422 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇది.
కేవలం మైనార్టీలకు ఇళ్ల పట్టాలివ్వడానికి స్థల సేకరణ కోసం రూ. 6050 కోట్లు
ఖర్చు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా హజ్ యాత్రికులకు ఆర్ధిక సాయం
చేసిన ముఖ్యమంత్రి జగన్. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఆర్ధిక సాయం చేస్తూ,
ఇచ్చిన మాటపై నిలబడ్డ నాయకుడు జగన్. జెరుసలేం వెళ్తున్న మైనార్టీ సోదరులకు
కూడా ఆర్ధిక సాయం అందిస్తున ప్రభుత్వం ఇదే.
98 శాతం మేనిఫెస్టో హామీలు నెరవేర్చాం
మేము మా మ్యానిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తాం. ప్రజలకిచ్చిన
హామీల్లో 98 శాతం అమలు చేసిన ప్రభుత్వం దేశంలోనే మా ప్రభుత్వం ఒక్కటే.
చంద్రబాబు హయాంలో విదేశాలకు వెళ్లకుండానే కొంత మంది డబ్బులు తీసుకుని భారీ
ఎత్తున అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి
విచారణలో కూడా తేలింది. అందుకే అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం
ప్రవేశపెట్టారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీకు సబ్ ప్లాన్‌కు
బదులు ఏపీ మైనార్టీస్ కాంపోనెంట్ అనే పేరుతో చట్టాన్ని కూడా చేశారు. ఈ చట్టం
దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేదు.
వైఎస్సార్ షాదీ తోఫా మైనార్టీలకు వరం
చంద్రబాబు హయాంలో దుల్హన్ పథకం పేరుతో కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చాడు.
2018–19 ఆర్ధిక సంవత్సరంలో 17,700 మంది లబ్ధిదారులకు రూ. 69 కోట్ల ఎగ్గొట్టిన
చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఇచ్చే రూ. 50 వేలు లబ్ధిదారులకు అందాలంటే
జన్మభూమి కమిటీలకు రూ. 20–25 వేలు లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆనాడు
ఉండేది. ఈ పథకాన్ని పూర్తిగా అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా
అందిస్తున్న ప్రభుత్వం మాది. అంతేకాదు చంద్రబాబు రూ. 50 వేలు ఇస్తే మనసున్న
ముఖ్యమంత్రి జగన్ దాన్ని రూ. లక్షకు పెంచారు.
మైనార్టీలకు రాజకీయ సాధికారత
స్వాతంత్ర్యం వచ్చాక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఒక ముస్లిం
మైనార్టీని ఉప ముఖ్యమంత్రిగా(నన్ను) నియమించడం దేశంలోనే ఒక చరిత్ర. నలుగురు
మైనార్టీ మ్మెల్యేలు, మండలిలో మరో నలుగురికి అవకాశం కల్పించిన నాయకుడు శ్రీ
వైఎస్జగన్. శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా ఒక ముస్లిం మైనార్టీ
జఖియాఖానంను ఎంపిక చేయడం ఒక చరిత్ర. ఆర్టీఏ చీఫ్ కమినర్ పదవిని కూడా ఒక
మైనార్టీ సోదరుడు ఆర్ఎం బాషాకి ఇచ్చి మైనార్టీలపై తనకున్న ప్రేమను
చాటుకున్నారు. చంద్రబాబు హాయంలో మాత్రం ఎన్నికలు ఆరు నెలలు ఉండగా మైనార్టీలు
గుర్తుకు వచ్చి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిని నియమించారు.
ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించాం
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఉర్ధూను రెండో
అధికార భాషగా గుర్తించలేదు. దాంతో ఉర్ధూ భాష అభివృద్ధికి నోచుకోలేదు.
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రమే, ఉర్ధూని రెండో అధికార
భాషగా ప్రకటించడంతో పాటు చట్టం చేశారు. ఫలితంగా ఉర్ధూ పూర్వ వైభవాన్ని
సంతరించుకుంటుంది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో చంద్రబాబును
నమ్మే పరిస్థితి లేదు. ఒక్కసారి మేలు చేస్తే.. జీవితాంతం మేలు చేసిన వారిని
గుర్తుపెట్టుకునే వ్యక్తులు మైనార్టీలు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు
కల్పించిన నాయకుడు, దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్. ఆయన తనయుడు వైఎస్
జగన్ కూడా నేడు అన్ని విధాల మైనార్టీల అభ్యున్నతికి తోడ్పడుతున్నారని
డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వివరించారు.