కడప : వైఎస్సార్ కడప జిల్లాలో నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి
కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో నేడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించనున్నారు. ఈ
సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. కడప
నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో రూ.1.37 కోట్లతో
పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61కోట్లతో పూర్తయిన రాజీవ్
మార్గ్ అభివృద్ధి పనులను ప్రారంభించి కడప ప్రజలకు అంకితం చేయబోతున్నారు.
అలాగే రూ.15కోట్లతో రెజూవనేషన్ ఆఫ్ పుట్లంపల్లె లేక్(అమృత్ 2.0),పాత
మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో రూ.31.17కోట్లతో నిర్మించనున్న కడప నగరపాలక సంస్థ
నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.106.44కోట్లతో కడప
కార్పొరేషన్ బలహీనవర్గాల హౌసింగ్ కాలనీలకు నీటిసరఫరా మరియు సీవర్
నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు, రూ.20కోట్లతో బుగ్గవంకపై రెండు నూతన వంతెనల
నిర్మాణానికి, రూ.50.22కోట్లతో కడపలో సీవరేజ్,సెపె్టడ్ మేనేజ్మెంట్కు,
బ్రహ్మంసాగర్ నుంచి కడప కార్పొరేషన్‌కు నీటి సరఫరా చేసేందుకు అమృత్ 2.0 కింద
రూ.572.76కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు, రూ.69.20కోట్లతో మేజర్ స్ట్రామ్
వాటర్ డ్రైనేజీ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
*సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న
నేపథ్యంలో కడప నగరం ఏపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా నిర్మించిన రాజీవ్ మార్గ్,
రాజీవ్ పార్కులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాజీవ్ మార్గ్‌లో
ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డివైడర్లు, వీధి దీపాలతో అందంగా తయారైంది. అలాగే
కిడ్స్ జోన్, ఓపెన్ జిమ్, యోగా జోన్, ఓఏటీ, రిక్రియేషన్ లాన్, రెస్ట్
రూమ్‌లతో కళాత్మకంగా తీర్చిదిద్దిన రాజీవ్ పార్కు సందర్శకులకు ఆహ్వానం
పలుకుతోంది.*
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజున సోమవారం కడప నగరంలో వివిధ
కార్యక్రమాల్లో పాల్గొంటారు. కడప ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని
ఆర్ట్స్ కళాశాల మైదానం, రాజీవ్‌మార్గ్, రాజీవ్ పార్క్, కొప్పర్తి
పారిశ్రామిక వాడ, కడప విమానాశ్రయాల వద్ద జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా బందోబస్తు విధులను
నిర్వహిస్తున్నారు. ఈ విధులలో ఎస్పీతో పాటు, కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్, సీఐలు,
ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర
సిబ్బంది పాల్గొన్నారు.