టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన
టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయంఅమరావతి : నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో మృతిచెందిన తెదేపా కార్యకర్తల
కుటుంబాలకు రూ.23లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ
మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన
టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున
రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని తొలుత ప్రకటించినా తాజాగా ఆ
మొత్తాన్ని పెంచారు. టీడీపీ తరఫున తొలుత ప్రకటించిన రూ.10లక్షల స్థానంలో
రూ.15లక్షలను బాధిత కుటుంబాలకు అందజేయనున్నారు. దీంతో పాటు పార్టీకి చెందిన
పలువురు నేతలు కూడా వ్యక్తిగతంగా ఆర్థికసాయం ప్రకటించారు. పార్టీ నేతలు
ప్రకటించిన రూ.8లక్షలతో కలిపి మొత్తం రూ.23లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు
ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులను
వారికి అందజేయనున్నారు.