అమరావతి : శ్రీకాళహస్తి ప్రమాదంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తీవ్ర
సంతాపం తెలిపారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ
వద్ద కారు, లారీ ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు మృతదేహాలను
ప్రభుత్వం స్వస్థలాలకు తరలించే బాధ్యత తీసుకోవాలని బిజెపి రాష్ట్ర
అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. దైవ దర్శానికి వెళ్లిన
విజయవాడ వాసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం పై విచారం
వ్యక్తంచేశారు. వాహనంలో ఏడుగురు ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో 6 గురు
అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే
ఆదుకోవాలని పురంధేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.