ఫిఫా ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్?
ఫిఫా వరల్డ్ కప్ 2023 లో లియోనెల్ మెస్సీ అద్భుతంగా రాణిస్తున్నాడు.
అర్జెంటీనాకు చెందిన ఈ వెటరన్ చక్కని ఆటతీరుతో మెరిసిపోయాడు. జట్టును
ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0తో క్రొయేషియా పటిష్ట
జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే ఫైనల్ మ్యాచ్ తర్వాత అతను
రిటైర్మెంట్ తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు మెస్సీ అభిమానులకు
షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఫైనల్ తర్వాత అర్జెంటీనా మీడియా కథనాల ప్రకారం
డిసెంబర్ 18న జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మెస్సీకి చివరి అంతర్జాతీయ
మ్యాచ్ కానుంది. 35 ఏళ్ల మెస్సీ ఫైనల్ తర్వాత అర్జెంటీనా జట్టుకు గుడ్ బై
చెప్పనున్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో మెస్సీ ఐదు గోల్స్ చేశాడు. ప్రపంచ కప్
పోటీలో అర్జెంటీనా ఆల్-టైమ్ బెస్ట్ గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో
గతంలో రెండో స్థానంలో ఉన్న గాబ్రియెల్ బాటిస్టుటా (10)ను అధిగమించాడు. 35 ఏళ్ల
ఫార్వర్డ్‌కు ప్రస్తుతం ప్రపంచకప్‌లో 11 గోల్స్ ఉన్నాయి.