బెంగుళూరు : కర్ణాటకలో ఒక్కో గ్రామానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని హామీ
ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కల్యాణ కర్ణాటక ప్రాంతానికి రూ.5వేల
కోట్లు కేటాయిస్తామన్నారు. కలబురగి జిల్లాలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ
కర్ణాటక ప్రజలకు ఈ హామీలు ఇచ్చారు. కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత
రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి
వస్తే ఒక్కో గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు మంజూరు చేస్తామన్నారు. కల్యాణ
కర్ణాటక ప్రాంతానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తామని వాగ్దానం చేశారు. (బీదర్,
యాద్గిర్, రాయచూరు, కొప్పల్, కలబురగి, బళ్లారి, విజయనగర జిల్లాలను కల్యాణ
కర్ణాటక ప్రాంతంగా పరిగణిస్తారు.) అదే విధంగా రాష్ట్రంలో 50వేల ప్రభుత్వ
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గురువారం కలబురగి జిల్లాలో ప్రచారం
నిర్వహించిన రాహుల్ గాంధీ ప్రజలపై ఈ హామీలు గుప్పించారు. ఈ అసెంబ్లీ
ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని రాహుల్ గాంధీ జోస్యం
చెప్పారు. బీజేపీకి 40 నంబర్ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆ పార్టీ నలభై సీట్లు
మాత్రమే గెలుస్తుందని ఎద్దేవా చేశారు. కర్ణాటక మంత్రులపై 40 శాతం కమీషన్ల
ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్ర
స్థాయిలో విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ ప్రభుత్వ పనులు చేపట్టిన
కాంట్రాక్టర్ల నుంచి ఆ పార్టీ కమీషన్ వసూలు చేసిందని ఆరోపించారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు గెలుచుకుని
అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓ దొంగ ప్రభుత్వంగా అభివర్ణించిన ఆయన
ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు.
రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న రాహుల్ గాంధీ తాము
అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.