ఉద్యోగుల తొలిగింపు విషయంలో ట్విట్టర్, అమెజాన్ బాటలోనే సాఫ్ట్వేర్ దిగ్గజం
మైక్రోసాఫ్ట్ కూడా నడుస్తోంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 1,600 మందికి పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ( IT
Crisis Microsoft ) రోడ్డు పడుతున్నారు. ప్రస్తుతం మాంద్యం భయాలు
అల్లుకుంటోన్న వేళ తొలగింపు వేగం పెరిగింది. గత ఏడాది కంటే ఎక్కువగా
ఉద్యోగాలు(tech) ఊడిపోతున్నాయని Layoffs.fyi సైట్ షాకింగ్ నిజాలను బయట
పెట్టింది. గత ఏడాది (2022)లో దాదాపు 1000 కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను
తొలగించాయని లెక్కించింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా
వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 10వేల మంది
ఉద్యోగులను తొలగించబోతుందని న్యూస్ వైరల్ అవుతోంది. ఆ విషయాన్ని
బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. అయితే, కంపెనీ మాత్రం ధ్రువీకరించడంలేదు.
రోజుకు 1,600 మందికి పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ (IT Crisis Microsoft ) ప్రపంచ వ్యాప్తంగా
2,20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది రెండుసార్లు ఉద్యోగుల
ర్యాంక్‌లను తగ్గించింది. గత కొన్ని వారాలుగా స్టాల్వార్ట్స్ సేల్స్‌ఫోర్స్ ,
అమెజాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. టెక్ సెక్టార్లో మరో 5
నుండి 10 శాతం ఉద్యోగులను తొలగిస్తారని వివిధ పోర్టళ్లు అంచనా
వేస్తున్నాయి. కంపెనీల్లో చాలా వరకు 1980లో రాక్ స్టార్స్ లాగా డబ్బు ఖర్చు
చేస్తున్నాయి. ఇప్పుడు ఖర్చు నియంత్రణలను పాలించాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు 2023 చేదు అనుభవాలతో
ప్రారంభమైంది. దాదాపుగా 91 కంపెనీలు కొత్త ఏడాది మొదటి 15 రోజుల్లో 24వేలకు
పైగా ఉద్యోగులను తొలగించాయి. ఈ గడ్డు పరిస్థితుల్లో లింక్డ్ఇన్ ద్వారా
స్నేహితులు, సహ ఉద్యోగులను సహాయం కోరుతున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి లింక్డ్ఇన్ యాప్ ను 58.4
మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక వేళ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను
తొలగిస్తే భారీగా మిగిలిన కంపెనీలు కూడా తొలగించే అవకాశం ఉంది. ఫలితంగా
సాఫ్ట్ వేర్ రంగం ఈ ఏడాది సంక్షోభంలోకి వెళ్లనుందని నిపుణుల అంచనా.