భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో విచిత్రమైన ఘటన
జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43వ ఓవర్లో వీధి కుక్క ఒకటి మైదానంలోకి
పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని పట్టుకునేందుకు సిబ్బంది పరుగులు తీశారు.
దీంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో సీన్ అబాట్, ఆస్టన్ ఆగర్
క్రీజులో ఉండగా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ వేసిన మూడో
బంతిని అబాట్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని సంధించేందుకు కుల్దీప్
సిద్ధమవుతుండగా ఓ వీధికుక్క మైదానంలోకి చొరబడింది.దీంతో దానిని వెళ్లగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది దాని వెనక పరుగులు తీశారు.
అది చూసిన శునకం భయపడి మైదానమంతా పరుగులు తీసింది. అది చూసిన టీమిండియా సారథి
రోహిత్ శర్మ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.