వెలగపూడి : దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్
తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీనే అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
తెలిపారు. మైనారిటీ సబ్ ప్లాన్ కింద రూ.4,203 కోట్లు ఇవాళ బడ్జెట్లో
కేటాయించామని, గతంలో ఏ ప్రభుత్వం మైనారిటీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని
చెప్పారు. సంక్షేమ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి అంజాద్‌బాషా మాట్లాడారు.
చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందని మంత్రి
గుర్తు చేశారు. మైనారిటీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని
విమర్శించారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మమ
అనిపించారని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ రోజు చంద్రబాబు మూడు నెలల మంత్రి
పదవి ఇచ్చి మభ్యపెట్టాలని చూశారని మండిపడ్డారు.