ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. ఈ రైనీ సీజన్ ని ఇష్టపడనివారు ఉండరు.
చిరుజల్లులు, చల్లటి వాతావరణం మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో
ఏదైనా రుచికరమైన స్నాక్స్ వేడివేడి పకోడీ,బజ్జి ఏదైనా స్పైసి ఐటమ్ తినాలని
అనిపిస్తుంది. అయితే ఈ కాలం వర్షాలతో పాటు..వ్యాధులను తన వెంట మోసుకొస్తుంది.
ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఆయిల్ ఫుడ్స్ తినడం అంత
మంచిది కాదు. కానీ మొక్క జొన్న తినటం వల్ల ఏన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

* మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది.
* కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి
తినచ్చు.
*గ్రేవీలో వేసి ఫ్రైడ్ రైస్ తో కలిపి తినవచ్చు లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి
వంటి వాటితో కూడా చేర్చి తినవచ్చు.
* మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్,
రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
* అంతేకాదు వీటికి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని వైద్యులు
చెపుతున్నారు.
*ఇక పీచు పుష్కలంగా ఉండటంతో ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుందట.
* ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మొలలు వంటివి రాకుండా
కాపాడుతుందని చెపుతున్నారు.