నిజానికి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే
వర్షాకాలంలో వీధి బండ్లపై విక్రయించే కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల కలిగే
ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు.
1.మొక్కజొన్న వర్షాకాలంలో వివిధ రకాల వైరస్లు మరియు బ్యాక్టీరియా నుండి
మిమ్మల్ని రక్షిస్తుంది.
2. వివిధ క్రిముల దాడి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకంటే మొక్కజొన్నలో
విటమిన్ బి1, బి5, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రకరకాల వ్యాధులకు ఇది ఒక
రకంగా యముడు లాంటిదని చెప్పవచ్చు.
3.వర్షపు నీరు సాధారణంగా ఆమ్లంగా ఉంటుంది. వర్షపు నీటిలో తడిస్తే చర్మం
దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి కాల్చిన
మొక్కజొన్న తినండి. ఇందులో విటమిన్ సి ఉన్నందున చర్మ వ్యాధులను నయం చేస్తుంది.
4. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో చాలా మంది యువకులు, వృద్ధులు కండ్లకలక
బారిన పడతారు. మరోవైపు, మొక్కజొన్నలో విటమిన్ ఎ,సి చాలా ఉన్నాయి. కాబట్టి కంటి
ఆరోగ్యం గురించి చింతించకండి.
5. వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి
పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న
తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.