బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న
మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే
ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట
ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. ఫలితంగా
భారత్ కంటే ఆస్ట్రేలియా జట్టు 47 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. ఆస్ట్రేలియా
తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60) రాణించాడు. టాప్ ఆర్డర్
బ్యాటర్లు మార్నస్ లబుషగ్నే (31), స్టీవ్ స్మిత్ (26) కూడా
పర్వాలేదనిపించారు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9) విఫలమయ్యాడు. భారత
బౌలర్లలో రవీంద్ర జడేజా జోరు కొనసాగుతున్నది. రెండో టెస్టు రెండో
ఇన్నింగ్స్‌లో జడేజా ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. మూడో టెస్టు తొలి
ఇన్నింగ్స్‌లో మొత్తం నాలుగు వికెట్లు అతని ఖాతాలోనే పడ్డాయి. అంతకుముందు
భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి భారత
బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. విరాట్ కోహ్లీ (22), శుభ్‌మన్
గిల్ (21), ఉమేశ్ యాదవ్ (17 ) శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12),
రోహిత్ శర్మ (12) మాత్రమే (రెండంకెల) స్కోరు చేయగలిగారు. మిగిలిన ప్లేయర్లు
అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో భారత్ 109 పరుగులకే ఆలౌట్
అయ్యింది. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్ 5, నాథన్ లియాన్ 3 వికెట్లు
తీశారు. టాడ్ మర్ఫీకి ఒక వికెట్ దక్కింది.