ఆరోగ్యానికి మంచిది .అయితే వాటిలో పెసలు (Green Moong) ) మొలకెత్తినవి తినడం
వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది మొలకెత్తిన పెసలను
(Sprouted Green తింటున్నారు. మొలకెత్తిన పెసల్లో ఫైబర్, రౌగేజ్, విటమిన్ సి,
విటమిన్ కె, ఫోలేట్, అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి.
* మొలకెత్తిన పెసలలో ఉండే విటమిన్ కె రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని
తగ్గిస్తుంది.
* మన శరీరంలోని కండరాల బలం పెంచడానికి మొలకెత్తిన పెసలలో ఉండే విటమిన్
ఉపయోగపడుతుంది.
* మొలకెత్తిన పెసలలో ఉండే ఆస్టియోకాల్సిన్ అనేది ఆరోగ్యకరమైన ఎముకల కణజాలాన్ని
ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
* మొలకెత్తిన పెసలు తినడం వలన అవి రక్తనాళాలలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని
తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.* గుండె సక్రమంగా పనిచేసేలా
చేస్తుంది.
*మొలకెత్తిన పెసలు తినడం వలన మన శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా
చేస్తుంది.
*మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
* మొలకెత్తిన పెసలు మన శరీరంలోని రక్తంలో చక్కర స్థాయిలు స్థిరంగా ఉండేలా
చేస్తుంది.
* మొలకెత్తిన పెసలు తినడం వలన ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తుంది.
* కీళ్ళకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా తగ్గుతాయి