హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు లబ్ధిదారులకు ఏ మేరకు
ఉపయోగపడుతున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశం
నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హాజరయ్యారు. ఇప్పటికే దేశ యువతకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.19 లక్షల కోట్లు
రుణాలు ఇచ్చామని ఆయన తెలిపారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన
పురోగతిని సాధించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ యువత కోసం
అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు.
అందులో భాగంగానే ముద్ర యోజన ద్వారా దేశ ఔత్సాహిక యువతను మోదీ ప్రభుత్వం
ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కేంద్ర
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి
కల్పిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక మంది యువత రుణాలు పొంది వారి వారి
రంగాల్లో దేశ ఆర్థిక పురోభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని కిషన్ రెడ్డి
వివరించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే
నినాదంతో సుమారుగా రూ.19 లక్షల కోట్ల వరకు ముద్ర రుణాలు ఇచ్చామన్నారు.తద్వారా దేశ యువత సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించుకునేందుకు
దోహదపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్ కంపెనీలు ఎలా
అభివృద్ధి చెందుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల పట్ల ప్రజల
అనుభూతి ఎలా తెలుసుకోవాలని ప్రధాని కోరిక మేరకు దేశవ్యాప్తంగా ఇలాంటి వర్క్
షాప్‌లు కండక్ట్ చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.