సెక్రటరీ టు గవర్నమెంట్ గా పనిచేస్తూ ఇటీవల ఆకస్మికంగా మరణించిన చోడిమల్ల
యర్రన్న యాదవ్ కు ఎపి స్టేట్ టైపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్
(సచివాలయ యూనిట్) యాదవ్ చిత్రపటానికి గురువారం రాష్ట్ర సచివాలయంలో పూలమాలలు
వేసి ఘనంగా నివాళులు అర్పించింది.1993లో నీటిపారుదల శాఖలో టైపిస్ట్ గా తన
ప్రస్తానాన్ని ప్రారంభించిన దివంగత యాదవ్ తదుపరి 1995 లొ సచివాలయ సర్వీసుకు
వచ్చి జూనియర్ స్టెనోగ్రాఫర్ గాను, సీనియర్ స్టెనోగ్రాఫరు గాను, స్పెషల్
కేటగిరీ స్టెనోగ్రాఫరు గాను, చివరిగా ప్రవేట్ సెక్రటరీ టు సెక్రటరీ టు
గవర్నెంట్ గాను పనిచేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స
పొందుతూ అసువులు బాసారు.
యాదవ్ వివిధ హోదాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో మూడు దశాబ్దాల పాటు సేవలు
అందించారని స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసు
కున్నారు.తన సర్వీసు కాలంలో ఈ అసోసియేషన్ కు ఒకసారి జనరల్ సెక్రటరీగాను,
7ఏళ్ళు అధ్యక్షునిగాను పనిచేసి విశేష సేవలందించి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం
దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో పరిష్కారం అయ్యేలా ఎనలేని కృషి చేశారని గుర్తు
చేసుకున్నారు. అంతేగాక రాష్ట్ర సచివాలయం ఉద్యోగ సంఘాల్లో అనేక హోదాల్లో
పనిచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం కృషి చేసే వారని గుర్తు
చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగులందరు సచివాలయ ఉద్యోగుల
సంఘానికి ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారని, కాని ఆయన ఆకస్మిక మరణం
కలచివేసిందన్నారు. దివంగత యాదవ్ తన కెరీర్ లో ఎంతో సౌమ్యునిగా పేరు తెచ్చుకుని
విధి నిర్వహణలో ఎనలేని సేలందించారని అసోసియేషన్ ప్రతనిధులు యాదవ్ సేవలను
ప్రత్యేకంగా గుర్తు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించారు. యాదవ్ కు నివాళులు
అర్పించిన ఈకార్యక్రమంలో రాష్ట్ర టైపిస్టు, స్టెనోగ్రాఫర్సు అసోసియేషన్ (
సచివాలయం యూనిట్) అధ్యక్షులు వి.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఎల్.సుధాకర్
రావు, ఉపాధ్యక్షులు ఎ.భాస్కరబాబు, కెఎన్ఎస్.అపర్ణ, ఎస్.గంగప్రసాద్ తోపాటు
పలువురు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.