మాజీ కేంద్ర మంత్రి జె.డి శీలం
విజయవాడ : యస్.సి, యస్.టి, బి.సి మైనార్టీలను అణగదొక్కితే ఖబద్దార్ అంటూ మాజీ కేంద్ర మంత్రి జె.డి శీలం బి.జె.పి దాని మిత్ర పక్షాలను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన అణగారిన వర్గాలను సమాయత్తపరిచే క్రమంలో ఏర్పాటు చేసిన కమిటీ వివిధ జిల్లాలు పర్యటిస్తూ ఎన్.టి.ఆర్ జిల్లా, విజయవాడకు విచ్ఛేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు అధ్యక్షత వహించారు. విజయవాడ నగర కమిటీ మరియు ఎన్.టి.ఆర్ జిల్లాల కమిటీ అధ్యక్షులు బొర్రా కిరణ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి జె.డి.శీలం ముఖ్య అతిధిగా విచ్ఛేసి మాట్లాడారు. బి.జె.పి, ఆర్.యస్.యస్ మరియు దాని మిత్రపక్షాలు కలసి యస్.సి., యస్.టి., బి.సి మైనార్టీలను అణగదొక్కే విధంగా వారికి రావలసిన ఆర్ధిక వనరులను గానీ, సంక్షేమ పథకాలను రద్దు చేస్తు మతతత్వాన్ని రెచ్చగొడుతూ విధ్వంస పాలనను కొనసాగించడం పట్ల ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. అణగారిన వర్గాలను ఐక్యం చేయడానికి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అని వక్తలు పేర్కొన్నారు. మణిపూర్ ఘటనను సభ ముక్తఖంఠంగా ఖండిరచింది. భారతదేశంలో ప్రజలు కాంగ్రాస్పార్టీ అధికారంలోకి రావాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని రాజ్యాంగ హక్కులు పరిరక్షింపబడతాయని వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తాంతియా కుమారి, కొరివి వినయ్ కుమార్, రాష్ట్ర యస్.సి ఛైర్మన్ సాకే శంకర్, రాష్ట్ర యస్.టి.ఛైర్మన్ పి.శాంతకుమారి, పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు. పి.వై కిరణ్, బైపూడి నాగేశ్వరరావు, నాగూర్, డి.రామకృష్ణ, అన్సారీ, ఖుషీదా, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని పి.వై.కిరణ్ పర్యవేక్షించారు.
ఘననివాళి : ప్రముఖ సీనియర్ నాయకులు విజయవాడ సిటీ మాజీ అధ్యక్షులు యం.జె రత్నకుమార్ ఆకస్మిక మృతికి ఆంధ్రరత్న భవన్లో పార్టీనాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూమిని తెలిపారు.