రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. 18 రోజుల
తర్వాత ట్విట్ చేశాడు. డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ రహదారిలో కారు
ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరుబాయ్
అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ‘నాకు వచ్చిన గుడ్ విషెస్‌కి, ఈ
సపోర్ట్‌కి నేను ఎంతో కృతజ్ఞుడిని. నా సర్జరీ విజయవంతమైందని తెలియచేస్తున్నా.
కోలుకోవడం మొదలెట్టా. ముందు వచ్చే ప్రతీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా
ఉన్నా. నాకు అన్ని విధాల అండగా నిలిచిన బీసీసీఐ, జై సా, ప్రభుత్వ అధికారులకు
థ్యాంక్యూ… ’ అంటూ ట్వీట్ చేశాడు రిషబ్ పంత్.జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్
మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతను మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే
వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడని సమాచారం… ‘రిషబ్ పంత్ వేగంగా
కోలుకుంటున్నాడు. డాక్టర్లు అతని రిహాబ్ ప్రాసెస్‌ని మొదలెట్టారు. త్వరలో అతను
వాకర్ ద్వారా నడవబోతున్నాడు. కొన్నిరోజులు మళ్లీ తనకాళ్లపైన నిలబడతాడు. అతను
పూర్తిగా కోలుకోవడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుంది…’ అని బీసీసీఐ అధికారి
వెల్లడించారు.