రథాన్ని ముందుకు తీసుకెళుతున్న అశ్వాల శక్తి సామర్థ్యాల్ని గుర్తుచేసేలా ఓ
వాహనం. అందులోని ఆయుధం చేతపట్టి యుద్ధభూమిలోకి దిగాడు అర్జున్. మరి ఆ పోరాటం
ఎలా సాగిందో తెలియాలంటే ‘గాండీవధారి అర్జున’ చూడాల్సిందే. వరుణ్ తేజ్
కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాక్షి
వైద్య కథానాయిక. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, బాపినీడు
నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం
నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. బుధవారం ప్రి టీజర్ ని విడుదల
చేశారు. “వరుణ్ తేజ్ ఇదివరకు ఎప్పుడూ కనిపించనంత కొత్తగా ఇందులో కనిపిస్తారు.
ఆయన చేసే పోరాట ఘట్టాలూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. ఐరోపా దేశాలతోపాటు,
అమెరికాలో భారీ హంగులతో సన్నివేశాల్ని తెరకెక్కించాం” అని తెలిపారు చిత్ర
బృందం. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ
జె. మేయర్.