బాలాయపల్లి :-
యువతకు విద్యతో పాటు క్రీడలు అవసరమని
బాలాయపల్లి మండలం వైస్సార్సీపీ కన్వీనర్ వెందోటి. కార్తీక్ రెడ్డి ప్రారంభించారు పేర్కోన్నారు. బుధవారం మండలంలోని గొట్టికాడు గ్రామంలోని గొట్టి కాడు గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని , భవిష్యత్తులో ఇలా క్రీడా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి బాలాయపల్లి మండలం కు మీ గ్రామాలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే , ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు. గెలిచాము అని గర్వపడవద్దు. స్నేహపూర్వకంగా క్రీడలన్నారు. ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలి అన్నారు.
పోటో:-క్కీకేట్ ఆడుతున్న దృశ్యం