విజయవాడ : యువతీ యువకులు పెద్దలను ఆదర్శంగా తీసుకోవాలని అప్పుడే మన
లక్ష్యాన్ని సాధించగలమని ఏ.పి.సి.సి. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సూచించారు.
విజయవాడ ఆంధ్రరత్న భవనంలో జరిగిన జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా
హాజరయ్యారు. మన్యం వీరుడు అల్లూరి ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి
రోశయ్య జయంతి, ప్రముఖ నాయకుడు సాహసశీలి వి.ఎమ్. రంగ జయంతి, జాతీయ జండా
సృష్టికర్త పింగళి వెంకయ్య వర్ధంతికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన
రంగా ప్రత్యేక కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు కె.వి.పి. రామచంద్ర రావు,
మాజీ కేంద్రమంత్రి జె.డి. శీలం ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అల్లూరి,
రోశయ్య , వి.ఎమ్. రంగ , పింగళి వెంకయ్య కి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి
జోహార్లు అర్పించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణి కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వీరితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు జంగా
గౌతమ్, సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, వి. గురునాథం,
వినయ్ కుమార్ , పి.వై. కిరణ్, ఎ.ఐ.సి.సి. సభ్యులు మేడా సురేష్, యువజన
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు, లామ్ తాంతియా కుమారి, మీసాల
రాజేశ్వర రావు, వేముల శ్రీనివాస్, బేగ్, పీటర్ జోసఫ్, అన్సారీ, సతీష్, గౌస్,
ఖుర్షిదా తదితరులు పాల్గొన్నారు.