తన రుతు చక్రం గురించి స్థానిక కాంగ్రెస్ సభ్యుడికి వాయిస్ మెయిల్ పంపి యునైటెడ్ స్టేట్స్లో ఒక మహిళ వార్తల్లోకి ఎక్కింది. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడంలో ఫాయె అనే మహిళ ప్రత్యేక మార్గం ఎంచుకుని.. నెటిజెన్ల ప్రశంసలు అందుకుంది. కాలిఫోర్నియాలోని 25వ జిల్లాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ గార్సియా కార్యాలయానికి ఆమె పంపిన వీడియోను అక్టోబర్ 27న ట్విట్టర్లో పంచుకుంది. “నా వైద్యపరమైన నిర్ణయాలలో స్థానిక రాజకీయ నాయకులను చేర్చుకోవడం సంతోషం” అని ఫాయె తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. మహిళా హక్కుల పరిరక్షణలో భాగంగా 2022 మధ్యంతర ఎన్నికలకు ముందు యూఎస్ పార్లమెంటులో మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ప్రస్తావించాలని ఆమె సూచించింది.